దండం దశగుణం భవేత్ అంటే
విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చఅంధ్యే తమసి వార్ధక్యే దండం దశ గుణం భవేత్.
అంటే పక్షులు, కుక్కలు, అమిత్రులు (జాలమిత్రులు కానివారు), పాముల, పశువులబారినుండి తప్పించుకోడానికి, బురదలో, నీటిలో, అందత్వం ప్రాప్తించినప్పుడు, చీకటిలో నడుస్తున్నప్పుడు కర్రసాయం పది విధాలు అని.
దాదాపు 20 ఏళ్లక్రితం చెట్లకింద నడుస్తున్నప్పుడు కనిపించిన ఒకకర్ర ఊరికే ఏరుకొచ్చేను. ఆ తరవాత మంచులో నడుస్తున్నప్పుడు దాన్ని చేతికర్రలా వాడుకున్నాను. విస్కాన్సిన్ వదిలేసినా ఆకర్ర
పారేయబుద్ధి పుట్టలేదు. ఇప్పుటికీ ఉంది.
ఈరోజు మామిత్రులు మళ్ళీ గుర్తుకి తెచ్చేరు ఈ చేపాటికర్ర.
000
(ఎన్నెమ్మ కతలు 23)
తెల్లారిలేచి కాఫీకప్పు పుచ్చుకుని కిటికీలోంచి చూస్తున్నాను ఉప్పుపాతరల్లా పరుచుకున్న మంచుకుప్పులు. అమెరికా వచ్చి 35 ఏళ్లయింది. ఇదే తొలిసారి నాకు మంచుని చూస్తే కోపం రావడం. “ఊసుపోక – చేపాటికర్ర” చదవడం కొనసాగించండి