అయ్యో ఒక్కరైనా చెప్పలేదు కథ Audio

విస్కాన్సిన్ లో మంచుకాలం నాకు ఎంతో ఇష్టమైన కాలం. చాలామందికి మంచు నచ్చదు కానీ నేను మాత్రం అడుగెత్తు మంచు పడ్డప్పుడు కూడా బయట తిరగడానికి వెళ్లేదాన్ని.

1978లో వేసవిలో యూనివర్సిటీలో  తెలుగుపాఠాలు చెప్పడం మొదలుపెట్టేను. అది ప్రత్యేకించి తమ చదువులో భాగంగా ఆంధ్రదేశంలో ఒక ఏడాదిపాటు గడపదలుచుకున్నవారికోసం సృష్టించిన crash course. పదివారాలలో ఏడాది చదువుకి తులతూగగల తెలుగు నేర్పాలి.

అందులో భాగంగా సరదాకి ఈకథ రాసేను. మనం ఎంత సిద్ధం అయేం అనుకున్నా, ఇంకా తెలీకుండా పోయేవి చాలా ఉంటాయని చెప్పడమే ఈ చిన్నికథ ధ్యేయం. ఇది  మొదట ఇంగ్లీషులో Six Blind Men అన్నపేరుతో Wisconsin Review లో ప్రచురించబడింది.

తరవాత తెలుగులోకి నేనే అనువదించుకున్నాను. ఇది కొప్పర్తి రాంబాబుగారి కంఠస్వరంలో వినండి. లింకు ఇక్కడ

ఆగస్ట్ 4, 2022

పెద్దతనం (కథ)

ఎవరో తట్టిలేపినట్టు ఉలిక్కిపడి కళ్లు తెరిచి చుట్టూ చూసింది కాంచన. ఎదురుగా బల్లమీద వాచీ పదకొండు దాటి పావుగంట అయిందంటోంది. అబ్భ! ఇంత వెలుగేమిటి? అనుకుంటూ “పెద్దతనం (కథ)” ‌చదవడం కొనసాగించండి

విల్లు రాసి చూడు

“నువ్వెలాగా ఇల్లు కట్టబోవడం లేదు. పిల్లలకి పెళ్లిళ్ళా నువ్వు చెయ్యఖ్ఖర్లేకుండానే అయిపోయాయి. వాళ్లే చేసేసుకున్నారు. అసలు నన్నడిగితే ఈ రోజుల్లో ఇల్లు కట్టడం, పెళ్ళి చెయ్యడం కూడా డబ్బు పారేస్తే అయిపోతాయి. “విల్లు రాసి చూడు” ‌చదవడం కొనసాగించండి

యోగాచెప్పులూ మరియు కర్మాఅప్పులూ

చెప్పులకి సంబంధించినంతవరకూ నేనింకా పాతరాతియుగంలోనే ఉన్నాను. “యోగాచెప్పులూ మరియు కర్మాఅప్పులూ” ‌చదవడం కొనసాగించండి

ఆ ఒఖ్ఖ మాటా! (కథ)

“నిన్ను చూసి ఆరేళ్ళయింది. నాకయితే ఏళ్ళూ పూళ్లూ అయినట్టుంది. బొత్తిగా రాడం మానేశావు? ఈ ఏడయినా ఒకసారి రాకూడదుటే?”

అలనాటి చెలి కామేశ్వరి రాసిన ఉత్తరం చేత పుచ్చుకుని దిగంతాల్లోకి చూస్తూ కూర్చుంది శాంత, గతించిన రోజులు తలబోసుకుంటూ. “ఆ ఒఖ్ఖ మాటా! (కథ)” ‌చదవడం కొనసాగించండి