నోరివారి వాఘిరా సమీక్ష

అజంతాగుహలు కేంద్రంగా సాగిన చిన్న నవల ఇది.  130 పుటలు. అజంతాగుహలగురించి చాలామందే విని ఉన్నా Continue reading “నోరివారి వాఘిరా సమీక్ష”

కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి సాహిత్యవ్యాసాలు

నోరి నరసింహశాస్త్రిగారు (1900-1978) పిన్నవయసులోనే కవిత్వం రాయడం ప్రారంభించి దాదాపు ఆరు దశాబ్దాలపాటు కవిత్వం, నాటకం, కథ, నవల, విమర్శవంటి ప్రధాన సాహిత్యప్రక్రియలలో ప్రతిభావంతమయిన రచనలు చేసి కవిసామ్రాట్ బిరుదునందుకున్నారు (1947). వివిధ సాహితీసంస్థల్లో ప్రముఖపాత్ర వహించి తెలుగుసాహిత్యంపట్ల తమకి గల అభిమానాన్నీ అభినివేశాన్నీ సగర్వంగా ప్రకటించుకున్నారు.  Continue reading “కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి సాహిత్యవ్యాసాలు”

నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి

13వ శతాబ్దంలో రుద్రమదేవి పరిపాలనలో కాకతి సామ్రాజ్యవైభవం కథ ఇది. రుద్రమదేవి పట్టాభిషేకం మొదలు ఆరు సంవత్సరాలపాటు ఆమె ఆధిపత్యంలో రాజకీయ, సాంఘిక, సాహిత్యప్రతిభ ఆవిష్కరించారు నోరి నరసింహశాస్త్రిగారు.

Continue reading “నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి”

చరిత్ర, చారిత్రక నవల

చరిత్రంటే తారీకులూ దస్తావేజులూ కావంటారు శ్రీశ్రీ.. చరిత్రకీ చారిత్రిక నవలకీ తేడా ఉందంటారు కవిసామ్రాట్ నోరి నరసింహశాస్త్రిగారు.

తెలుగు నవలకి ఆద్యం లార్డ్ మేయో బెంగాలీలని వారి సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే నవలలు రాయమని కోరడం అని ఆరుద్ర రాశారు (సమగ్రాంధ్రసాహిత్యం సం. 4, తెలుగు ఎకాడమీ ప్రచురణ). ఒక జాతి సంస్కతీ సాంప్రదాయాలనీ, ఆచారవ్యవహారాలని నవలలు చెప్పినంత వివరంగా చరిత్ర చెప్పదు అని మేయో అభిప్రాయం అనుకుంటాను. Continue reading “చరిత్ర, చారిత్రక నవల”