మార్పు 2వ కూర్పు

2014లో ప్రచురించిన మార్పు నవల, 358 పేజీలనుండి 223 పేజీలకి కుదించి, అసందర్భం అనుకున్న అనేక సంఘటనలూ, సన్నివేశాలూ తొలగించి, అప్డేట్ అయిన అభిప్రాయాలు కొన్ని మరింత స్పష్టం చేస్తూ ఈ రెండవకూర్పు సంస్కరించేను.

మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.
మార్పు రెండవకూర్పు, 2022

నిడదవోలు మాలతి

జనవరి 1, 2022

మార్పు 28

“ఈయేడు అరవైలు నిండుతాయి,” అన్నారు ప్రభాసరావు పంచాంగం చూస్తూ.

“పెద్దత్తయ్య వస్తానంటోంది కదా అమెరికా చూడ్డానికి. మనవాళ్ళందర్నీ పిలిచి పండుగ చేస్తే బాగుంటుంది,” అన్నాడు విషి.

“అవును, తెలుగువాళ్ళకి షష్టిపూర్తితో జీవితకాలం ఒక ఆవర్తి పూర్తయి రెండో ఆవర్తి మొదలెట్టడమన్నమాట.”

“అదేమిటి? అరవై ఏళ్ళకే జీవితం అయిపోతుందా?” “మార్పు 28” ‌చదవడం కొనసాగించండి

మార్పు 27

“పదండీ, అలా నడుస్తూ మాటాడుకుందాం,” అన్నాను, లీలమనసుకి నదీజలాలు తెరిపి ఇస్తాయేమోనన్న ఆశతో. “పదండి,” అంటూ ఇద్దరూ లేచేరు.

తీరాన నడుస్తున్నాం నెమ్మదిగా. లీల నెమ్మదిగా గతాన్ని గుర్తు చేసుకుంటూ నీటి అట్టడుగు పొరల్లోకి చూస్తున్నట్టు ఆగింది.

“ఇక్కడే నా మొదటి ఫొటో. సిమెంటు చెప్టాలా గడ్డ కట్టిన నదీజలాలమీద నేను నిల్చుని తీసుకున్న బొమ్మ మాఅమ్మకి పంపేను. “మార్పు 27” ‌చదవడం కొనసాగించండి