స్వేచ్ఛ

ఏ నాలుకలు తల్లిభాష ఉచ్చరించలేవో

ఏ ప్రజలు పరభాషను మనఃపూర్వకంగా నెత్తికెత్తుకుంటారో

ఏ జనులు మాతృభాషను స్వేచ్ఛందంగా కలుషితం చేస్తారో

ఏ ప్రజలలో నా సంస్కృతి అన్న స్పృహ శూన్యమో

ఏ జాతికి ఎరువు తెచ్చుకున్నభావాలు శిరోధార్యమో 

ఆ స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు. ఆ స్వాతంత్ర్యంలో అర్థం లేదు.

ఆ స్వేచ్ఛ నాకొద్దు. ఆ స్వాతంత్ర్యదినం నాకు ఉత్సవదినం కాదు.

ఆ జాతి నాది కాదు. ఆ దేశం నాది కాదు.

నాదేశంలో నేను విదేశీగానే ఉండిపోతాను.

000

(ఆగస్ట్ 14, 2021)

కుక్క పారిపోయింది

అదొక చిన్న పల్లె. ఇది ఏదేశంలోనైనా కావచ్చు. పట్టుమని వంద ఇళ్ళు కూడా లేవు.

ఊరి శివార్ల అడవి. వెయ్యిమైళ్లు అనేక రకాల చెట్లు, పొదలూ, రాళ్లూ Continue reading “కుక్క పారిపోయింది”