మంచివాడి మరణం

పుణ్యపురుషులమరణం పెళ్ళితో సమానం

కొందరు బతికుండగా ఎన్నో ఘనకార్యాలు చేస్తారు.
కొందరు చచ్చి సాధిస్తారు.
John McCain బతికున్నప్పుడూ చనిపోయేకా
దేశసేవ కొనసాగిస్తున్న పుణ్యపురుషుడు.

ఒక నీతికీ నియమానికీ కట్టుబడి పార్టీకంటె దేశప్రజ ప్రధానమని చాటినవాడు.
తనతప్పులనూ ఎదటివారి తప్పులనూ
ఒక్కలా ఎత్తిచూపగలవాడు.

ఉపనాయకులలో ఏమూలో అణగారిపోయిన అంతరాత్మని తట్టి లేపి, ఇసుమంత చలనం కలిగించగలిగిన వీరుడు.

మనదేశంలో ప్రాణత్యాగం చేసిన మహావీరులకోవ.

ప్రస్తుతం  post-మరణ నాటకం మంచి పాఠం.
000

జాన్ మెకైన్ ఎవలో తెలీనివారికి,

సూక్ష్మంగా, వియత్నాం యుద్ధంలో పాల్గొని, శత్రువులకి చిక్కి, అనేక కృూరహింసలు అనుభవించి, తిరిగివచ్చినవాడు. రిపబ్లకన్. ఇతర వివరాలు కావలసినవారు అంతర్జాలంలో చూడవచ్చు.
నాలో మాత్రం ఎన్నో ఆలోచనలు రేపుతోంది John McCain అస్తమయం.
000
(ఆగస్టు 28, 2018)

ప్రకటనలు